తెలంగాణలో ఈ నెల 16 నుంచి 139 కేంద్రాల్లో తొలి విడుత కరోనా వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 3.60 లక్షల డోసుల వ్యాక్సిన్లు వచ్చాయని, విడుతల వారీగా కోఠిలోని కోల్డ్ స్టోరేజీ నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్లు వేసేందుకు 99 ప్రభుత్వ, 40 ప్రైవేట్ దవాఖానల్లో ఏర్పాట్లు చేశామన్నారు. తొలి డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారన్నారు. వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలో భద్రపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 800 కోల్డ్ చైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలిరోజు 13వేల 900 మంది హెల్త్వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తామన్నారు.