29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

కరెంట్ బిల్లు ఫోనుకే.. త్వరలోనే స్మార్ట్ సేవలు..

కరెంట్ బిల్ అతను నెలనెలా వచ్చి చెప్తే గానీ మనకు బిల్ ఎంత వచ్చిందో తెలీదు. అలా కాకుండా.. కరెంటు ఎంత వాడామోమొబైల్ లోనే తెలిసిపోతే బాగుంటుంది కదూ.. అన్నీ డిజిటల్ అయిన ఈ రోజల్లో వీటికి మాత్రం లేట్ ఎందుకు.. అందుకే విద్యుత్ సేవలను కూడా స్మార్ట్ గా మన ముందుంచనున్నారు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ బృందం.


కరెంటు ఎంత వాడామో ఎప్పటికప్పుడు మెసేజ్ రావడం, బిల్ కట్టాక కన్ఫర్మేషన్ రావడం, కరెంట్ కోతల గురించి అప్ డేట్స్.. ఇలా అన్ని సేవలు డిజిటల్ గా రాబోతున్నాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ జీడిమెట్లలో ఈ స్మార్ట్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తారు.


విద్యుత్‌ వినియోగంలో స్మార్ట్‌సేవలు అందించడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్మార్ట్‌గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రయోగాత్మకం గా చేపట్టారు. ఇందుకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ ఫలితాలు పాజిటివ్ గా ఉంటే.. ఈ సేవలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.


ఇది అందుబాటులోకి వస్తే.. ప్రీ పెయిడ్‌ విధానంలో కరెంటు బిల్లులు ఫోన్‌ బిల్లులా కట్టేయొచ్చు. విద్యుత్‌ బిల్లు మెసేజ్ రూపంలో పొందొచ్చు. ప్రీపెయిడ్ బిల్లు కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగిస్తే ఫోన్ కి మెసేజ్ వస్తుంది. అప్పుడు వినియోగదారుడు లోడ్‌ క్యాటగిరీని మార్చుకోవచ్చు. ప్రకృతి విపత్తుల సమయంలో ఏ లైనులో ఎక్కడ నష్టం జరిగిందో సరిగ్గా తెలుసుకోవచ్చు. ఇలా ఈ టెక్నాలజీతో చాలానే ఉపయోగాలున్నాయి.

- Advertisement -

Latest news

Related news