ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్.. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండటం సంతోషకరమని సినీ నటి అనుష్క అన్నారు. కొవిడ్ సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారని మెచ్చుకున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఫిల్మ్ నగర్లో పోలీసుల ఆధ్వర్యంలో ‘ షీ-పాహీ’కార్యక్రమానికి సినీనటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరై డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విశిష్ట సేవలందించిన పోలీసులకు అవార్డులు అందించారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ..మగవారికి పోటీగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. పోలీసు శాఖలో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో ఒకేసారి 2058 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
డీజీ స్వాతిలక్రా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో స్త్రీ, పురుషులనే వివక్ష ఉండదని, మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని, ఈ ఏడాది భరోసా కేంద్రాలను 10కి పెంచుతామన్నారు.