టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌కు బయలు దేరిన అజారుద్దీన్ సుర్వార్ సమీపంలో కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న దాబాలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో అజార్ కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. దాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడ్డ అజారుద్దీన్ మరో వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్రేక్ వేసే క్రమంలో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.