26 C
Hyderabad
Wednesday, January 27, 2021

రైతు వేదికలు దేశానికే ఆదర్శం.. మంత్రి మల్లారెడ్డి

రైతు వేదికలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌ రూరల్‌ మండల పరిధిలోని రాయిలాపూర్‌, పూడూరు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తూ రైతుల సంక్షేమం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నారన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను మెరుగైన పద్ధతుల్లో సాగుచేస్తూ అభివృద్ధి చెందాలని రైతులకు సూచించారు.

- Advertisement -

Latest news

Related news

త్రివర్ణ హైదరాబాద్

72వ గణతంత్ర దినోత్సం వేళ హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్రక భవనాలు త్రివర్ణ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వీటి వెలుగులను ఒకే ఫ్రెమ్ లో బంధించేందుకు డ్రోన్ కెమెరాలతో...

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...