23 C
Hyderabad
Wednesday, February 24, 2021

తొలిరోజు విద్యార్థుల హాజరు శాతం ఎంతో తెలుసా..?

దాదాపు 10 నెల‌ల విరామం తర్వాత తెలంగాణలో సోమవారం నుంచి స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. 9, 10 క్లాసులకు తొలుత క్లాసులు తీసుకుంటున్నారు.  స్టూడెంట్లు మాస్క్ లు ధరించి హాజరయ్యారు. స్కూళ్లకు వ‌చ్చిన ప్ర‌తి స్టూడెంట్ కి శానిటైజెష‌న్ చేసిన తర్వాతే క్లాస్ రూమ్ ల‌లోకి అనుమ‌తిచ్చారు.

60 శాతం హాజరు

రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం స్టూడెంట్స్ స్కూళ్లకు హాజరయ్యారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో 100 శాతం హాజరు నమోదవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. స్టూడెంట్స్ హాజరు తప్పనిసరి కానందున క్లాసులకు రాని వారికి టీచర్లు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తారని మంత్రి గుర్తుచేశారు. కరోనా నేపథ్యంలో 30 శాతం సిలబస్ తగ్గించామన్నారు. 70శాతం సిలబస్ ప్రకారమే రాబోయే మూడు నెలలు తరగతులు కొనసాగుతాయన్నారు. కింది స్థాయి తరగతులు ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

- Advertisement -

Latest news

Related news