32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

జూనియర్ చేగువేరా..

నేడే జార్జ్ రెడ్డి పుట్టినరోజు

తెలంగాణ చేగువేరా అని పిలుచుకునే జార్జ్ రెడ్డి పుట్టినరోజు ఈరోజు. బతికుంటే మనదేశానికి నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చే గొప్ప సైంటిస్ట్ అయ్యుండేవాడని కొందరంటే.. దేశాన్ని ముందుకు నడిపే నాయకుడు అయ్యుండేవాడని కొందరంటారు. జార్జ్ రెడ్డి ఎలా ఉండేవాడు? అతనిలో ఇన్ని డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలా వచ్చాయి?

బాల్యం ఇలా..
చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా రఘునాథ రెడ్డి, కేరళకు చెందిన లీలా వర్గీస్‌లకు 1947 జనవరి 15న ఐదో సంతానంగా జార్జ్ రెడ్డి జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి దూరం అవ్వడంతో టీచర్‌గా చేస్తూ.. తల్లే పిల్లల్ని చదవించింది. జార్జ్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా బెంగుళూరు, చెన్నైలోనే జరిగింది. 1962లో కుంటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. నిజాం కళాశాలలో పీయూసీ పూర్తి చేశాడు. 1964లో బీఎస్సీ చేయటానికి ఉస్మానియా సైన్సు కళాశాలలో చేరాడు. ఆ తర్వాత పీజీ, పీహెచ్ డీ ఉస్మానియా క్యాంపస్‌లో చదివాడు.

ఉద్యమాలతో ఇన్‌స్పైర్ అయ్యి…
జార్జ్.. చదువుకునే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు ఊపు మీద ఉన్నాయి. అమెరికా వియత్నాం యుద్ధం, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో జాత్యహంకారంపై తిరుగుబాట్లు, భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమాల్లాంటివి జరిగేవి. జార్జ్‌పై వాటి ఎఫెక్ట్ కూడా కొంత ఉంది. పైగా అదే సమయంలో ఉస్మానియాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరిగింది.
కింది కులాలు, చిన్న ఉద్యోగులు, కొత్త విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులుంటే.. జార్జ్ వారి పక్షాన ఉండి పోరాటం చేసేవాడు. ఎవరైనా వచ్చి తన కష్టం చెప్పుకుంటే ముందూ వెనకా చూడకుండా వారి తరపున వెళ్లి అవతలి వ్యక్తిని ఒప్పించో లేదా కొట్టి అయినా సరే బాధితుడికి న్యాయం చేసేవాడని చెప్తారు.

ఉస్మానియాలో చదివే రోజుల్లో జార్జ్ ఎక్కువసమయం లైబ్రరీ, జిమ్‌ల్లో గడిపేవాడు. చేగువేరా, భగత్ సింగ్ లాంటి విప్లవ కారులు, హేగెల్, మార్క్స్, ఫ్రాయిడ్ లాంటి సిద్దాంతవేత్తల పుస్తకాలు ఎక్కువగా చదివేవాడు. ముఖ్యంగా చేగువేరా జీవిత చరిత్ర జార్జ్‌ను బాగా ప్రభావితం చేసింది . ఎదురించే ధైర్యం పుస్తకాల నుంచే వచ్చిందని అతని స్నేహితులు చెప్తుంటారు.

అందరికీ ఆ ఒక్కడే అండ..
జార్జ్ ఒక్క రంగంలో అని కాదు అన్ని రంగాల్లో ఎక్స్‌పర్ట్. చదువులో, నిజాయితీలో, ఆలోచనల్లో స్పష్టత ఉన్న వ్యక్తి. సైన్స్ నుంచి రాజకీయాల వరకూ అన్నీ విషయాలు మాట్లాడేవాడు. తన చుట్టూ ఉండేవాళ్లని ఇన్‌స్పైర్ చేస్తూ ఉండేవాడు. మరోపక్క ఫిజికల్‌గా కూడా జార్జ్ చాలా స్ట్రాంగ్. పైగా బాక్సర్ కూడా. ఇన్ని క్వాలిటీస్ ఉండడం వల్ల అతను స్టూడెంట్‌ లీడర్‌గా విద్యార్థులకు ముందుడి సమస్యలు పరిష్కరించేవాడు. యూనివర్సిటీలో ఆడపిల్లలపై జరిగే లైంగిక దాడులను, దళితులు, పేద విదార్దులపై జరిగే ర్యాగింగ్ ల్లాంటివాటిని ముందుండి ప్రశ్నించేవాడు. ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా ఎలాంటి గొడవకైనా వెళ్లేవాడు. అందుకే విద్యార్డులు జార్జ్‌ను జూనియర్ చేగువేరా అని పిలుచేవారు. జార్జ్ రెడ్డి విషయంలో అందరూ అంగీకరించే రెండు విషయాలు ఆయన తెలివితేటలు, అతని ఆవేశం.. ఈ రెండు క్వాలిటీస్ జార్జ్ రెడ్డిని మిగిలినవారికంటే ప్రత్యేకంగా నిలిపాయి.

రాజకీయాలు మొదలై..
అలా జార్జ్ విద్యార్థులను చేరదీసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించార‌ు. జార్జ్ రంగ ప్రవేశంతో ఉస్మానియాలో కాంగ్రెస్ విద్యార్థి సంఘం బలం తగ్గింది. అప్పుడే బీజేపీ అనుబంధ ఏబీవీపీ పుట్టింది. దీంతో రైట్ వర్సెస్ లెఫ్ట్, ఏబీవీపీ వర్సెస్ పీడీఎస్‌యూ రాజకీయాలు మొదలయ్యాయి.
అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు ఉండేవి. అవి హింసాత్మకంగా ఉండేవి. విద్యార్థి సంఘాల మధ్య తరచూ కొట్లాటలు విపరీతంగా జరిగేవి. స్వతహాగా బాక్సర్, ఆవేశపరుడైన జార్జ్‌ రెడ్డి ఈ గొడవల్లో కూడా ముందుండే వాడు. ఈ గొడవలే అతని మరణానికి కారణమయ్యాయి.

ఇలా అమరుడయ్యాడు
ఒకసారి ఉస్మానియా క్యాంపస్‌లో స్టూడెంట్స్ ఎలక్షన్స్‌లో జార్జ్ రెడ్డి నిలబెట్టిన దళిత వర్గాలకు చెందిన ఓ విద్యార్థి బంపర్ మెజారిటీతో విజయం సాధించాడు. ఆ ఓటమిని తట్టుకోలేక కొందరు జార్జ్‌ని చంపటానికి స్కెచ్ వేస్తే ఒంటరిగా ఫైట్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అలా రానురాను జార్జ్‌కి పాపులారిటీ బాగా పెరిగింది. స్టూడెంట్స్ రాజకీయాల్లో కొద్దికొద్దిగా ఎదుగుతున్న సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలో మరోసారి ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ సారి జార్జ్‌ని ఎలాగైనా ఓడించాలని భావించిన అపోజిషన్ పార్టీలు జార్జ్‌ని చంపడానికి ప్లాన్ చేశాయి. 30 మంది కిరాయి గుండాలు క్యాంపస్‌లోకి ప్రవేశించారు. 1972 ఏప్రిల్ 4 వ తేదీన ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ దగ్గర 30 మంది గుండాలు జార్జ్ ను చుట్టుముట్టి, ఒకటి కాదు రెండు కాదు మొత్తం 60 కత్తి పోట్లు పొడిచి జార్జ్ ను అత్యంత కిరాతకం గా చంపారు.

జార్జ్ చనిపోయినా అతనిచ్చిన ఇనిస్పిరేషన్ ఇప్పటికీ అలానే ఉంది. జార్జ్ ఇచ్చిన ఇనిస్పిరేషన్‌తో 1974లో ప్రోగ్రెసివ్ అండ్ డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ PDSU ఏర్పాటైంది. ఇప్పటికీ PDSU జెండాపై జార్జ్ చిరునవ్వుతో మనకు కనిపిస్తూనే ఉంటాడు.

‘జీనా హై తో మర్నా సీఖో’ అనే అతని నినాదం ఇప్పటికీ మన రాష్ట్రంలో వినిపిస్తూనే ఉంటుంది.

- Advertisement -

Latest news

Related news