గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా బంజారాహిల్స్ కార్పోరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయలక్ష్మి పేరును మేయర్ గా ప్రతిపాదించగా.. చేతులెత్తే పద్ధతిలో అందరూ ఏకగ్రీవంగా ఆమెకే ఆమోదం తెలిపారు. మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి ఎల్ఎల్బీ చదివారు.
2016లో బంజారాహిల్స్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కార్పోరేటర్ గా గెలిచిన విజయలక్ష్మి 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరోసారి అదే డివిజన్ నుంచి విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయలక్ష్మి జీహెచ్ఎంసీ మేయర్ బాధ్యతలు చేపట్టారు. మేయర్ గా ఎన్నికైన విజయలక్ష్మికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు.