29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటీమణి లక్ష్మీ ప్రియా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ ఆర్టిస్ట్ జాకీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నానక్ రాంగూడలో సినీ నటీమణి లక్ష్మీ ప్రియా మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నట్లు ఈ సందర్భంగా లక్ష్మీ ప్రియా చెప్పారు. మనకు ఆరోగ్యం, అందం కావాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా సమాజంలో మార్పును తీసుకొస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు చెప్పారు. తర్వాత ఆర్టిస్ట్ సుజాత, ఆర్టిస్ట్ సత్యశ్రీ, ఆర్టిస్ట్ వాని లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరింది.

- Advertisement -

Latest news

Related news