‘నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. కానీ నేను నా కూతురు ఇద్దరమే ఉంటాం. కూతురు పెండ్లి అయితే నేనొక్కదాన్నే ఉండాలి. ఇంత పెద్ద ఇంట్లో నేనొక్కదాన్నేఎలా ఉంటా.. అందుకే ఎవరైనా అవసరమైన పేదలకు ఇయ్యామని డబుల్ బెడ్రూం తిరిగి ఇస్తున్న’ అని సిద్దిపేట పట్టణానికి చెందిన రచ్చ లక్ష్మీ మానవత్వాన్ని చాటుకున్నారు.
రచ్చ లక్ష్మీ భర్త కృష్ణ మూర్తి ఆమె భర్త చనిపోయాడు. ప్రస్తుతం తన కూతురుతో కలిసి తమ్ముడు నగేష్ దగ్గర ఉంటుంది. నిరుపేద కావడంతో డబుల్ బెడ్రూం ఇల్లు కోసం అప్లై చేసుకోవడంతో డబుల్ బెడ్రూం వచ్చింది. కానీ కూతురుతో కలిసి తామిద్దరమే డబుల్ బెడ్రూం ఇంటిలో ఉండలేమని తనలాంటి ఎవరైనా పేదలకు ఆ ఇంటిని ఇవ్వాలని తనకు వచ్చిన ఇంటిని తిరిగి ఇచ్చేస్తానని మంత్రి హరీష్ రావును తన ఇంటికాడ కలిసి చెప్పింది. దీంతో హరీష్ రావు ఇవాళ ఈరోజు కేసీఆర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ చేత పట్టా కాగితాలు, ఇంటి తాళం చెవిని జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్మన్లకు ఇప్పించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. ఇలా ఎవరైనా ఉంటే లక్ష్మీ ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తనకు భర్త లేడు.. కూతురుతో కలిసి ఇద్దరమే ఉంటామని, తనలాంటి నిరుపేదకు ఈ డబుల్ బెడ్రూం ఇవ్వండని నిజాయితీగా వచ్చి ఇంటి తాళం చెవి అప్పగించిందన్నారు. లక్ష్మీ స్ఫూర్తిగా నిలిచి మానవత్వాన్ని చాటుకుందన్నారు. తన కుటుంబానికి అన్ని విధాలా సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు.