హిందువులు ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా మొదట గోపూజతో ప్రారంభించడం ఆనవాయితీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. గగన్ పహాడ్ లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద గోశాలను ఆయన సందర్శించారు. కబేళాకు వెళ్లాల్సిన గోవులను కాపాడి.. వాటికి కొత్త జీవితాన్ని ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. గోశాలకు ఒక రోజు అయ్యే ఖర్చు ఒక లక్ష యాభై వేల రూపాయలను తన జీతం నుంచి అందిస్తున్నట్టు తెలిపారు.
నగరాన్ని ఆనుకొని ఇంత పెద్ద గోశాల ఉందని.. భారతదేశంలోనే ఇది రెండో అతిపెద్ద గోశాల అని మంత్రి తెలిపారు. ఇక్కడ దాదాపు 5500 గోవులను సంరక్షిస్తున్నారు. ఆ రోజుల్లో గో మూత్రం ,గో మలం, వేపాకు కలిపి చక్కటి సేంద్రియ ఎరువులు తయారు చేసి వ్యవసాయం చేసేవారని.. పంట మంచి దిగుబడి వచ్చేదని, భూమికి కూడా బలం పెరిగేదని మంత్రి గుర్తు చేశారు. రసాయనాలకు అలవాటు ప్డ వారంతా మళ్ళీ ఇప్పుడు సేంద్రియ ఎరువుల వైపు పరుగులు తీస్తున్నారన్నారు. గోవు, గోమూత్రం, గోమలం ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గం లో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను గుర్తించి 150 మందికి గోవులను ఇచ్చినట్టు పేర్కొన్నారు మంత్రి హరీశ్ రావు.