29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ప్రజల ప్రేమే ముందుకు నడుపుతుంది : మంత్రి ఈటెల

ప్రజారోగ్య వైద్యుల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి వైద్యారోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజారోగ్యం పట్ల కమిట్ మెంట్ ఉన్న డాక్టర్లే గ్రామాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్నారని.. వైద్యులు బాగా పనిచేస్తేనే ప్రజలు బాగుంటారని, ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని మంత్రి అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు గ్రామదేవతలతో సమానమని మంత్రి కితాబిచ్చారు. పేదలకు వైద్యసేవలందించడం గొప్ప వరమన్నారు.
పేదరికం నుండి వచ్చిన వారు, పేదలకు సాయం చేయాలనే తపన ఉన్నవారే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లుగా పనిచేస్తున్నారు. మీరు ప్రజలకు మరింత నమ్మకం కల్పించాలని మంత్రి సూచించారు. ఒకప్పుడు కాయకష్టం చేసేవారికి, గ్రామాల్లో ఉండేవారికి కొన్నిరకాల జబ్బులు రావనే భావన ఉండేది. కానీ.. ఇప్పుడు కిడ్నీ, క్యాన్సర్లు, లివర్ వ్యాధులు అందరికీ వస్తున్నాయని.. చికిత్స కోసం డబ్బులు ఖర్చు చేయలేక కుటుంబాలే విచ్ఛిన్నమైపోతున్నాయని ఈటెల అన్నారు.
ఇన్ సర్వీస్ పీజీ అనే ప్రతిపాదనతో తాను కూడా ఏకీభవిస్తున్నట్ుట మంత్రి తెలిపారు. త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి వెహికిల్ అలవెన్స్, ప్రోటోకాల్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమాజంలో వైద్యుల పట్ల మరింత గౌరవం పెరిగేలా నిర్ణయం తీసుకుంటానని మంత్రి తెలిపారు. కరోనాను ధీటుగా ఎదుర్కున్న దేశమని, చాలా రాష్ట్రాల కంటే ముందే కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేసి కాపాడుకున్నామని.. ఆ విషయంలో డాక్టర్ల సేవలు మరిచిపోలేనివని మంత్రి అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవం వచ్చినా ఎదుర్కునే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉందన్నారు. డాక్టర్ నరేష్ భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చినందుకు వైద్యుల బృందం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Latest news

Related news