18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

హిమాచల్ ప్రదేశ్ బండారు దత్తాత్రేయకు తృటిలో తప్పిన ప్రమాదం

సూర్యాపేటలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఉన్నట్టుండి స్టీరింగ్ లాక్ అవడంతో అదుపు తప్పింది.

ప్రమాద సమయంలో కారులో గవర్నర్ దత్తాత్రేయతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. దత్తాత్రేయ సహాయకుడికి స్వల్పంగా గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని హైదరాబాద్ తరలించారు. అనంతరం మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు తన పర్యటన నిమిత్తం వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, ఎస్సై వెంకన్నలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...