29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

హైద‌రాబాద్ మెట్రోలో తొలిసారి గుండె తరలింపు

హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారిగా మనిషి గుండెను తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను అపోలో వైద్యులు మెట్రో ట్రైన్‌లో తరలించి సక్సెస్ అయ్యారు. మెట్రో ట్రైన్ ద్వారా తరలించిన ఈ గుండెను మరో వ్యక్తిని అమర్చనున్నారు.
న‌ల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడు. ఆయన గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్యక్తికి గుండె మార్పిడికి ఏర్పాట్లు చేశారు.

ఎల్బీన‌గ‌ర్ కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో వరకూ మెట్రో ట్రైన్‌లో గుండెను త‌ర‌లించారు. ప్రజల ట్రాన్స్‌పోర్ట్ అవసరాలతో పాటు.. ఎమర్జెన్సీ ట్రాన్స్‌పోర్ట్‌కు కూడా మెట్రో ఇలా ఉపయోగపడడం నిజంగా మంచి విషయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Latest news

Related news