కరోనా కారణంగా నిలిచిన గొర్రెల పంపిణీని సత్వరం చేపట్టాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి దశ గొర్రెల పంపిణీ కోసం దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సీఎం ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.