29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ అమలు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్‌) వారికి విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంద‌ని సీఎం అన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండగా.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో రిజర్వేషన్లు 60 శాతానికి చేరుకుంటాయని సీఎం చెప్పారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం తర్వాత దీనికి సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్అలో ధికారికంగా విడుదల చేస్తామని సీఎం చెప్పారు.

- Advertisement -

Latest news

Related news