29.3 C
Hyderabad
Monday, March 1, 2021

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మిషన్ భగీరథ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందుబాటులోకి వచ్చిన తాగునీరును వాటర్ బాటిల్స్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం భగీరథ నీరు ఉంటుందని, కార్పోరేట్ కంపెనీల బాటిల్ నీళ్లలో లేని లవణాలన్నీ భగీరథ నీటిలో ఉన్నాయని స్మితా సభర్వాల్ చెప్పారు. పుకార్లు, విమర్శలను పట్టించుకోకుండా భగీరథ నీటిని తాగాలన్నారు.

సీఎం కేసీఆర్ ఘనత

ప్రభుత్వం తన ఉద్యోగులకు ఉచితంగా తాగునీటి బాటిళ్లను సరఫరా చేస్తుందని ఎవరైనా ఊహించారా.. అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. మిషన్‌ భగీరథ తాగునీటి బాటిళ్లపై ఎంపీ ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. మిషన్‌ భగీరథ నుండి తాగునీటి బాటిళ్లను తీసుకురావడం సీఎం కేసీఆర్‌ ఘన విజయమన్నారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఈ బాటిళ్లను సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Latest news

Related news