18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

జనవరి 13 నుంచి ఐనవోలు మల్లన్న జాతర ప్రారంభం.. కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి

ఐన‌వోలు శ్రీ మ‌ల్లికార్జున స్వామి జాత‌ర జ‌న‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వ‌ర‌కు నిర్వహించ‌నున్నట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు స్పష్టం తెలిపారు. ఈ జాత‌ర‌కు అశేషంగా త‌ర‌లివ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని ఆల‌య అధికారులు, అర్చకుల‌ను మంత్రి ఆదేశించారు. భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన భ‌ద్రత‌, లావెట్రీలు, చ‌లువ పందిళ్ళు, మంచినీటి వ‌స‌తి, స్నానాల గ‌దులు, బ‌ట్టలు మార్చుకునే గ‌దులు, మ‌హిళ‌ల‌కు ప్రత్యేక వ‌స‌తులు, క్యూ లైన్లు, విద్యుత్, సీసీ కెమెరాలు, భ‌క్తుల‌కు అన్నదానం వంటి అనేక వ‌స‌తుల క‌ల్పన పై ఆయాశాఖ‌ల ఉన్నతాధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు.

కోటి రూపాయలతో అభివృద్ధి ప‌నులు

రూ. కోటితో ఐనవోలులో శాశ్వత ప్రాతిపదికన బాత్ రూంల నిర్మాణానికి ముందుకు వచ్చిన కుడాని, చైర్మన్ మర్రి యాదవ రెడ్డిని మంత్రి అభినందించారు. అలాగే, జాతరలో సోడియం హైడ్రోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేసేందుకు, నిరంతర శానిటేషన్‌కి అంగీకరించిన మేయర్ గుండా ప్రకాశ్ రావుని మంత్రి అభినందించారు.

మాస్కు ధ‌రిస్తేనే ద‌ర్శనం

కొవిడ్ నేప‌థ్యంలోత‌ప్పనిస‌రిగా క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని, మాస్కులు ధ‌రిస్తేనే భక్తులను దర్శనానికి అనుమతించాలని సూచించారు.  వైద్యశాఖతో పాటు, ఆరూరీ గట్టుమల్లు ట్రస్ట్ నుండి మాస్కు లు పంపిణీ చేయాలని సూచించారు. భ‌క్తుల‌కు ద‌ర్శనార్థం చేసే ఏర్పాట్లలో కరోనా నిబంధ‌న‌లు పాటించాల‌న్నారు. భ‌క్తులు కిక్కిరిసి పోకుండా, సామాజిక దూరం పాటించేలా చూడాల‌ని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది స‌మ‌న్వయంతో ప‌ని చేయాల‌ని చెప్పారు. జాతర నేపథ్యంలో ఐనవోలుకు ఆర్టీసీ అదనంగా 25 బస్సులు నడపనుంది. కాగా, రోడ్ల మరమ్మతులు, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, ఫైర్ ఇంజన్, వైద్య సదుపాయాలు తదితర అంశాల వారీగా మంత్రి సమీక్షించారు. ఐన‌వోలు మ‌ల్లికార్జున స్వామికి మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...