తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీ షెడ్యూల్‌ని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం విడుదల చేశారు. నేటి నుంచి ఫిబ్రవరి 11 లోపు ఫైన్ లేకుండా.. రూ.100 ఫైన్ తో ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు, రూ.500 ఫైన్ తో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు, రూ.1000 ఫైన్‌తో మార్చి 3 నుంచి 9 వరకు, రూ.2000 ఫైన్ తో మార్చి 10 నుంచి 16 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం ఇచ్చింది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందన్నారు.
మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. మే 2 నుంచి 20 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిదే. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్.. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఏప్రిల్ 3న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
