ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ మే 1 నుంచి మొదలుకాబోతున్నాయి. మే 1 నుంచి మే 20వ తేదీ వరకు ఇంటర్ పరిక్షలు నిర్వహించబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మే 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్, మే 2 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ ఎగ్జామ్ ఏప్రిల్ 1న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఏప్రిల్ 3న ఉంటాయి. ఒకేషనల్ కోర్సులకూ ఇదే టైంటేబుల్ వర్తిస్తుంది.
