29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

దివ్యాంగులకు ఉపకరణాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ వికలాంగులకు అవసరమైన వివిధ ఉపకరణాలు మంజూరీ కోసం ఆన్ లైన్ ద్వారా (https://tsobmms.cgg.gov.in) దరఖాస్తులను స్వీకరిస్తోంది. దివ్యాంగులు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 18005728980 ని ఏర్పాటు చేసింది. వికలాంగులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించటంలో ఎలాంటి సమస్యలు, సందేహాలను నివృతి చేసుకోవచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు +919866702555కి కూడా కాల్ చేసి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

అప్లై చేయడం కోసం కావలసినవి..

1. ఆధార్ కార్డు

2. FSC (రేషన్) కార్డు

3. సదరం సర్టిఫికేట్

4. కులం సర్టిఫికేట్

5. ఇంతకుముందు ఏదైనా లబ్ధి పొందిన వివరాలు

6. ఇన్కమ్ సర్టిఫికేట్

7. స్టూడెంట్స్ అయితే స్టడీ సర్టిఫికేట్

- Advertisement -

Latest news

Related news