ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్, ధర్మకర్త నర్సింహారెడ్డి తెలియజేశారు. జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. జోగులాంబాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ ని ఆహ్వానిస్తూ.. సోమవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహంతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరారు. అంతకు ముందు అరణ్య భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ధర్మకర్త నర్సింహారెడ్డి, దేవాస్థాన అర్చకులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వివరించారు.