18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలు చాలా గొప్పవి : సీఎం కేసీఆర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళుల‌ర్పించారు. నిరంత‌ర‌ సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ ఆయన అవలంబించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్ఠపరిచిందని సీఎం కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...