ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ రావడం శుభపరిణామమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. జిల్లాలో మొత్తం 6479 మందికి వ్యాక్సిన్ టీకాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కొవిడ్-19 టీకా కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్యక్రమంలో ప్రభుత్వం అందరికి టీకా అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దీపికా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ కిశోర్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, దవాఖాన సూపరిండెంట్ మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.