29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేలా.. కేటీఆర్

పేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌తికేలా స‌క‌ల సౌక‌ర్యాల‌తో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేప‌ట్టామ‌ని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బాగ్‌లింగంప‌ల్లిలోని లంబాడీ తండాలో కొత్త‌గా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించుకోవ‌డంతో మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని పేర్కొన్నారు. లంబాడీ తండాలో రూ. 10 కోట్ల 90 ల‌క్ష‌ల‌తో 126 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను నిర్మించి ఇస్తున్నామ‌ని తెలిపారు. ఒక్కో ఇంటిపై రూ. 9 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. ఈ ఇండ్ల‌ను కిరాయికి ఇవ్వ‌డం, అమ్మ‌డం లాంటివి చేయొద్దన్నారు. మార్కెట్లో రూ. 50 ల‌క్ష‌లు ధ‌ర ప‌లికేలా ఇండ్ల‌ను పేద‌ల‌కు క‌ట్టించి ఇచ్చామన్నారు.

పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాప‌న

శ‌నివారం న‌గ‌రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు. దోమ‌ల‌గూడ‌లో జోన‌ల్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ప‌నుల‌కు, నారాయ‌ణ‌గూడ‌లో మోడ్ర‌న్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ రెడ్డి, ‌ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, అంబ‌ర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేశ్‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

ఎల్బీనగర్‌లో మంచినీటి రిజర్వాయర్లు..

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చేందుకు కొత్త పేట్ లో నిర్మించిన 2.5 ఎంఎల్‌ (మిలియన్ లీటర్లు) సామర్ధ్యం గల రెండు మంచినీటి రిజర్వాయర్లను మంత్రి శ్రీ కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి, మేయ‌ర్ శ్రీ బొంతు రామ్మోహ‌న్‌ పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...