29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నిరుద్యోగులకు కేటీఆర్ గుడ్ న్యూస్

రాష్ట్రంలోని నిరుద్యోగులకు మినిస్టర్ కేటీఆర్ గుడ్ న్యూస్ అందించారు. ‘సీఎం కేసీఆర్ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు’ అని కేటీఆర్‌ చెప్పారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశంలో ఈ మేరకు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలను ఇచ్చినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు కేటీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. ఈ సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

Latest news

Related news