19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని ప్రారంభించిన కేటీఆర్

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఇవాళ ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని ప్రారంభించుకున్నామ‌ని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌ హిల్స్ లో ఉచిత తాగునీటి ప‌థ‌కాన్ని కేటీఆర్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఇంటింటికి తిరిగి జీరో నీటి బిల్లుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో  కేటీఆర్ మాట్లాడారు. డిసెంబ‌ర్ న‌ల్లా బిల్లు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదని  కేటీఆర్ చెప్పారు. తాను చ‌దువుకునే రోజుల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెల‌తో మ‌హిళ‌లు.. జ‌ల మండ‌లి ముందు ధ‌ర్నా చేసేవారన్నారు. ప్రస్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నామ‌న్నారు. ఉచిత తాగునీటి ప‌థ‌కం ద్వారా గ్రేట‌ర్ ప‌రిధిలో 9 ల‌క్షలకుపైగా కుటుంబాల‌కు ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. 2048 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో తాగునీటి క‌ష్టాలు రాకుండా ఏర్పాట్లు చేశామ‌న్నారు. రూ. 9,714 కోట్లతో ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామ‌న్నారు.  కేసీఆర్ ఏడేండ్ల పాల‌న‌లో ప‌న్నులు పెంచ‌లేదని, రిజిస్ర్టేష‌న్‌, క‌రెంట్ బిల్లులు, ఇంటి ప‌న్నులు పెంచ‌లేదన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...