23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

అతిపెద్ద లాజిస్టిక్‌ పార్కును ప్రారంభించిన కేటీఆర్

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ మారేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లాజిస్టిక్‌ పార్కును అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినంక కరెంట్‌ సమస్యలు పూర్తిగా తొలగిపోయినట్లు వెల్లడించారు. బాట సింగారం లాజిస్టిక్‌ హబ్‌తో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.  లాజిస్టిక్‌ హబ్‌కు భూమిని ఇచ్చిన వారందరికీ ఒక్కొక్కరికి 120 గజాల చొప్పున భూమిని ఇస్తామన్నారు. ఫార్మా పరిశ్రమలతో  కాలుష్యం పెరుగుతుందని కొందరు విషప్రచారం చేస్తున్నారని, కానీ ఆధునిక టెక్నాలజీతో కాలుష్యాన్ని అరికట్టే అవకాశం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news