29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలకు కార్పొరేట్ హంగులు.. కేటీఆర్ ట్వీట్ వైరల్

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలను నూతనంగా తీర్చిదిద్దారు. 1000 మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఉన్న ఈ స్కూళ్లో ఏర్పాటు చేశారు.  టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఫొటోలను పోస్ట్‌ చేశారు. కార్పొరేట్‌ పాఠశాలలను సైతం తలదన్నేలా ఉన్న ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అనారోగ్యం బారిన పడిన విద్యార్థుల కోసం ఓ సిక్‌ రూమ్‌, మోడ్రన్ లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌, డైనింగ్‌ హాల్‌, 11 సీసీటీవీ కెమెరాలు, వైఫై సదుపాయం, ఫుట్‌బాల్‌ కోర్టును ఏర్పాటు చేశారు. సీఎస్‌ఆర్‌ కింద పీపీపీ పద్ధతిలో ఈ పాఠశాలను ఆధునికీకరించారు. ‘తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇలా మార్చడమే నా కల’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Latest news

Related news