రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ శివారులో గల ఓ వ్యవసాయ బావిలో చిరుత పులి పడిపోయింది. బావిలో ఏదో సౌండ్ రావడం గమనించిన రైతు తొంగి చూడగా అందులో చిరుతపులి కనిపించింది. వెంటనే.. గ్రామస్తులకు సమాచారం అందించాడు. బావిలో పడిన చిరుతను చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున బావి దగ్గరికి వచ్చారు. బావిలో చిరుత పడిన విషయాన్ని గ్రామస్తులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు చెప్పారు. వెంటనే అధికారులు ఘటనా స్థలికి చేరుకుని బావిలో పడిన చిరుతను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.