ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం మర్లపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మర్లపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత ఆవుపై దాడి చేసి హతమార్చింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుత జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని, రైతులు రాత్రివేళ పొలాలకు వెళ్లొద్దని అటవీ శాఖాధికారులు సూచించారు. సాధ్యమైనంత త్వరగా చిరుతను పట్టుకుంటామని అధికారులు చెప్పారు.