32.7 C
Hyderabad
Monday, March 1, 2021

అత్యాచార నిందితుడికి.. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు

ఆరేళ్ల బాలికను అత్యాచారం చేసి.. ఆపై చంపేసిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై దినేష్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియకూడదని ఆ చిన్నారిని హత్య చేశాడు. 2017లో జరిగిన ఈ ఘటనను సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. లేబర్ క్యాంపు వైపు తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు బాలికను అక్కడే హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పక్కాగా సేకరించి.. నిందితుడికి శిక్ష పడేలా చేశారు. కోర్టు సైతం ఈ కేసును తీవ్రమైనదిగా పరిగణిస్తూ తీర్పు చెప్పింది. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి కోర్టు నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేసింది.

- Advertisement -

Latest news

Related news