29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

సాగరతీరంలో.. దీపం ఆకృతిలో..

హైదరాబాద్‌లో మరో కొత్త టూరిస్ట్ స్పాట్ రాబోతోంది. తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతిని.. ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిపేందుకు శాశ్వత స్మృతిచిహ్నాన్ని నిర్మిస్తుంది ప్రభుత్వం.


హైదరాబాద్‌ హుసేన్‌ సాగర్‌ తీరంలో అమరవీరులకు గుర్తుగా నిరతరం జ్యోతి వెలగనుంది. అమరుల త్యాగాలు ఎల్లకాలం గుర్తుండిపోయేలా అమరుల స్మృతి చిహ్నం నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా, దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులు, పర్యాటకులు హైదరాబాద్‌కు వస్తే చిహ్నాన్ని చూసి మెచ్చుకునేలా దీన్ని ప్లాన్ చేస్తున్నారు.


అమెరికా, చైనాలో ఉన్న ఉక్కు నిర్మాణాలకు దీటుగా ఈ చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. దీన్ని1200 టన్నుల స్టీల్‌తో నిర్మిస్తున్నారు. మూడు అంతస్తుల నిర్మాణం అంతా స్టీల్‌తోనే చేపట్టారు. ఇందులో జ్వలించే దీపానికే 50 టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు. 10,656 చదరపు అడుగులతో నిర్మిస్తున్న మొదటి అంతస్థులో ఫొటోగ్యాలరీ, మ్యూజియం, ఆడియో, వీడియో విజువల్‌, బుక్స్‌ ఎగ్జిబిషన్‌ ఉంటాయి. 16,964 చదరపు అడుగుల నిర్మాణం ఉండే రెండో ఫ్లోర్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంటుంది. 8,095 చదరపు అడుగులు ఉండే మూడో అంతస్థులో రెస్టారెంట ఉంటుంది. ఇక్కడి నుంచే అమరుల జ్యోతిని తిలకించొచ్చు. జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు, నివాళులు అర్పించొచ్చు. పైన 37 మీటర్ల వెడల్పుగా ప్రమిద ఉంటుంది. ఈ ప్రమిదపై 26 మీటర్ల ఎత్తున వెలుగుతున్న జ్యోతి ఉంటుంది. ఈ జ్యోతి 365 రోజులు వెలుగుతూనే ఉంటుంది. దీని కోసం ప్రత్యేకమైన డిజైన్‌, సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఈ స్మృతి చిహ్నం రాకతో హుస్సేన్ సాగర్ లుక్ మారిపోతుంది. ఈ చిహ్నం నిర్మాణం మార్చినెలాఖరు కల్లా పూర్తిచేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news