29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ప‌ద్మ‌శ్రీ కనకరాజును సన్మానించిన మంత్రి అల్లోల

గుస్సాడీ నృత్య గురువు, ప‌ద్మ‌శ్రీ కనకరాజును మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఘ‌నంగా స‌న్మానించారు. జైనూర్ మండ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మ‌ర్ల‌వాయిలోని  క‌న‌క‌రాజు నివాసాని వెళ్లి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ.. ఆదివాసీ సంప్ర‌దాయ నృత్యాన్ని తనదైన శైలిలో ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువ‌చ్చార‌ని కొనియాడారు. ఓ సాధరణ ఆదివాసీ గుస్సాడి కళాకారుడికి పద్మశ్రీ అవార్డు దక్కడం మ‌నంద‌రికీ గర్వ‌కార‌ణ‌మ‌న్నారు. క‌న‌క‌రాజు కోరిక మేర‌కు మ‌ర్ల‌వాయిలో త్వ‌ర‌లోనే డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు క‌ట్టిస్తామ‌ని మంత్రి హామినిచ్చారు. అంతకుముందు మంత్రి అల్లోల కుమ్రం భీం, హైమ‌న్ డార్ఫ్ విగ్ర‌హాల‌కు నివాళుల‌ర్పించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, ఆసిఫాబాద్ జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కోవా ల‌క్ష్మి, ఆదిలాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధ‌న్, ఎమ్మెల్యేలు ఆత్రం స‌క్కు, రాథోడ్ బాపురావు, కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news