21.2 C
Hyderabad
Monday, January 18, 2021

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు ఎందుకు లేదు : మంత్రి హరీశ్ రావు

దేశంలో బీజేపీ 17 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నా.. ఎక్కడా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదన్నారు మంత్రి హరీశ్ రావు. జహీరాబాద్‌లో రైతులకు 24 గంటలు కరెంటు వస్తుంటే.. దాని పక్కనే ఉన్న బీజేపీ పాలిత కర్ణాటకలోని బీదర్‌లో మాత్రం కనీసం నాణ్యమైన కరెంటు ఆరు గంటలు కూడా ఇవ్వట్లేదని, అక్కడ మోటర్లు కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. అది విడిచిపెట్టి రాష్ట్రంలోని బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒక్కసారి పక్కనున్న కర్ణాటకలో ఎటువంటి పథకాలు అమలుచేస్తున్నారో తెలుసుకోవాలని మంత్రి బీజేపీ నాయకులకు హితవు పలికారు.

దేశంలో 17 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ ఎందుకు అమలుచేయడంలేదు? కనీసం రైతులు పండించిన పంటలు ఎందుకు కొనడం లేదని బీజేపీ నేతలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలంలోని హుగ్గెల్లిలో ఆయన రైతు వేదిక భవనం ప్రారంభించారు. జహీరాబాద్‌కు పక్కనే బీదర్‌ ఉన్నది. అక్కడ బీజేపీయే అధికారంలో ఉన్నది. మరి అక్కడ ఎందుకు ఉచిత కరెంట్‌ ఇవ్వడం లేదు? గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న మనిషి రైతులు తిన్నది అరుగక ఆత్మహత్య చేసుకుంటున్నారని చిల్లర మాటలు మాట్లాడారు ఇదీ బీజేపీ నాయకుల తీరు. ఇతర పార్టీలను, ప్రభుత్వాలను విమర్శించడమే గానీ.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం రైతులకు, ప్రజలకు మేలు చేసే పనులు చేయరు అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెంట్‌ సరఫరా చేయకపోగా.. 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కర్ణాటకలో వ్యవసాయానికి బీజేపీ ప్రభుత్వం కనీసం ఆరు గంటలైనా కరెంట్‌ ఇవ్వడం లేదన్నారు. దీంతో అక్కడ రైతుల మోటర్లు కాలిపోతున్నాయని, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నదో తెలంగాణ బీజేపీ నాయకులు తెలుసుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...