26.6 C
Hyderabad
Sunday, January 24, 2021

సిద్ధిపేటలో రెండో విడత డబుల్ బెడ్రూం పట్టాల పంపిణీ పట్టాలు పంచిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్లలోకి రెండో విడతలో 180 కుటుంబాలకు మంత్రి హరీశ్ రావు పట్టాలు అందించారు. కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్న దంపతులకు కొత్త బట్టలు అందించి గృహ ప్రవేశాలు చేయించారు. రేపు మరో 180 కుటుంబాలు సామూహిక గృహ ప్రవేశం చేయనున్నాయి. మొదటి విడతలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పట్టాలు అందుకున్న 144 కుటుంబాలు సామూహిక గృహ ప్రవేశం చేశారు. నర్సాపూర్ వద్ద ఇప్పటికే 2460 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది.

పేదరికమే ప్రమాణికంగా లబ్దిదారులను ఎంపిక చేశామని.. గూడు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పేదలకు ఇండ్లు కేటాయించి.. కొత్త బట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించామన్నారు హరీశ్ రావు. ప్రభుత్వం కేటాయించిన ఇండ్లను కిరాయికి ఇచ్చినా.. అమ్ముకున్నా.. తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనన్నారు. కేసీఆర్ నగర్ కు ఆర్టీసీ బస్సు, ప్రాథమిక చికిత్స కేంద్రం, త్వరలో దుకాణాల కేటాయింపు వంటి సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలిపారు. బడి, రేషన్ షాప్, గుడి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

Latest news

Related news

బుడ్డోడి టాలెంట్ కి మంత్రి కేటీఆర్ ఫిదా

ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు. ఏ మూల చూసినా.. ప్రతీ ఒక్కరి దగ్గర ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. కాస్త ఎంకరేజ్మెంట్, ట్రైనింగ్ ఇస్తే.. ప్రపంచాన్ని ఓ...

సుధీర్ అదరగొట్టేశాడు!

బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్,...

జాతి నిర్మాణంలో సాహిత్యం పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత

మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ వారి ఆధ్వర్యంలో 610 మంది కవుల భాగస్వామ్యంతో హైదరాబాద్ లో జరిగిన పద్య ప్రభంజనం-దేశభక్తి పద్య బృహత్ సంకలనం ఆవిష్కరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత...

ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటివరకూ వైట్ హౌస్‌ను వీడనని మారాం చేశారు. కానీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వీడక తప్పదు కదా. అందుకే అయిష్టంగానే వైట్...