ఈపీటీఆర్ఐ క్యాలెండర్‌ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. అరణ్యభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతిఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని చెప్పారు.
“గ్రీన్ స్పేస్ యోగ ఫర్ వెల్నెస్” అనే ఇతివృత్తంతో పాటు ప్రతి నెల జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యకతను ఈ క్యాలెండర్లో పొందుపరిచినట్లు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా మంత్రికి వివరించారు.