హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS)ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 27.6 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఎక్కడాలేదని, సీడీఎస్ ప్రాంగణంలో ఉండటం మనకు గర్వంగా ఉందన్నారు.
సీడీఎస్ నిర్మాణం వలన ఎస్సీ, ఎస్టీ యువతకు మేలు జరుగుతుందన్నారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారికి ఈ సెంటర్ లో అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి చెప్పారు. అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ సీడీఎస్ కు శంకుస్థాపన చేసినట్లు గుర్తుచేశారు. రూ 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సెంటర్ ను అంబేడ్కర్ రాబోయే జయంతి నాడు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్పులు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యే లు ఆత్రం సక్కు, కాలే యాదయ్య పాల్గొన్నారు.
