24.2 C
Hyderabad
Friday, January 22, 2021

డబుల్ బెడ్రూం ఇళ్లతో.. పేదోడి కళ్లలో ఆనందం : మంత్రి కేటీఆర్

తెలంగాణ‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌దే అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. న‌గ‌రంలోని వ‌న‌స్థలిపురం ప‌రిధిలోని జైభ‌వాని న‌గ‌ర్‌లోని రైతుబజార్ వ‌ద్ద నిర్మించిన 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.పేదోడు ఆత్మగౌర‌వంతో బ‌త‌కాల‌న్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వారి ఆత్మగౌర‌వానికి ప్రతీక‌గా ఉండేలా ఈ ఇండ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామన్నారు. ఇలాంటి ఇండ్లు దేశంలోని ఏ రాష్ర్టంలో ఏ ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల్లో కూడా ఇలాంటి ఇండ్ల నిర్మాణం సాధ్యపడలేదన్నారు. రెండు ప‌డ‌క‌గ‌దులు, ఒక హాల్, కిచెన్‌తో పాటు రెండు బాత్రూమ్‌లను నిర్మించాం. ఒక్కో ఇంటికి రూ. 9 ల‌క్షలు ఖ‌ర్చు చేశామని తెలిపారు. దాదాపు రూ. 50 ల‌క్షల విలువ చేసే ఫ్లాట్‌ను పేద‌ల‌కు సీఎం కేసీఆర్ ఇస్తున్నార‌ని తెలిపారు.

ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఇండ్లు నిర్మిస్తున్న ఘ‌న‌త సీఎం కేసీఆర్‌ది అన్నారు. క‌మ‌ర్షియ‌ల్ అపార్ట్‌మెంట్ల త‌ర‌హాలో డ‌బుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించామని చెప్పారు. ఇల్లు బాగుంటే స‌రిపోదు.. ప‌రిస‌రాల‌ను కూడా ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. చెత్తను తీసుకొచ్చి ఇండ్ల మ‌ధ్యలో పారేయొద్దు. కొత్త రోగాలు, జ‌బ్బులు రాకుండా ఉండాల‌న్నా, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాల‌న్న పరిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇందుకోసం క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని ఈ గృహ స‌ముదాయాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. రెండు ఎక‌రాల విస్తీర్ణంలో 3 బ్లాక్‌లు, 9 అంత‌స్తుల్లో కూ.28 కోట్ల వ్యయంతో 324 డ‌బుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. సొంతింటి కల సాకారమైనందుకు లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల కల సాకారమైందని.. సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని లబ్దిదారులు ఆనందంతో తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.