29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

కేటీఆర్ మెచ్చిన టీ వర్క్స్

చిన్నారుల కోసం టీ వర్క్స్ తయారుచేసిన అధునాతన ఉయ్యాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఆస్పత్రుల్లోని చిన్నపిల్లల కోసం అధునాతనంగా రూపొందించిన ఉయ్యాలను చూసిన కేటీఆర్ టీవర్క్స్ బృందాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా.. తక్కువ బరువుతో ఎలాంటి బోల్టులు, నట్లు లేకుండా తయారుచేయడం గొప్ప విషయం అని కొనియాడారు.


పసిపిల్లలకు బెడ్ మాదిరిగా, ఉయ్యాల మాదిరిగా రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్తూ.. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పిల్లల కోసం ఇలాంటి వినూత్న పరికరాలు, వస్తువులు రావాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

Latest news

Related news