29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రాష్ట్రంలోనే ఉత్తమ డిగ్రీ కాలేజీ కట్టుకుందాం : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి కేజీ టూ పీజీ ఒకే ఆవరణలో ఉండే విదంగా ఏర్పాటు చేద్దామన్నారు మంత్రి కేటీఆర్. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే బాధ్యత నాది అని.. రాష్ట్రంలోనే ఉత్తమ డిగ్రీ కాలేజీ ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు. అమ్మాయిల కోసం హాస్టల్ ను వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో తెలంగాణలోనే అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. సర్కారు విద్య అంటే.. ఏదో మొక్కుబడిగా కాకుండా.. ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ప్రభుత్వ బడుల్లో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతుందన్నారు. ఉన్నత విద్య కోసం జ్యోతిబాపులే ,అంబేద్కర్ ఓవర్సీస్ కింద ఫీ రియంబర్స్ మెంట్ ఇస్తున్నామని తెలిపారు. సినారే పేరు మీద ఏర్పాటు చేసిన లైబ్రరీ.. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి వేదికగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వచ్చిన వారికి.. శరవేగంగా అనుమతులు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందకి ఉపాధి కల్పించామని తెలిపారు. ప్రతి ఒక్కరికి స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్ ఉండాలని.. నైపుణ్యాలుంటే ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తామని మంత్రి సూచించారు.

- Advertisement -

Latest news

Related news