20.2 C
Hyderabad
Sunday, March 7, 2021

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు.. మంత్రి కేటీఆర్ ప్రశంసలు

జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేశారని అభినందించారు.

నిన్నటితో మేయర్ గా బొంతు రామ్మోహన్ పదవీకాలం ముగియడంతో ట్విట్టర్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, నగర పౌరులకు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చేసిన ట్వీట్ షేర్ చేస్తూ.. కేటీఆర్ రామ్మోహన్ ను ప్రశంసించారు. తెలంగాణ రాష్ర్టంలో జీహెచ్ఎంసీ తొలి మేయ‌ర్‌గా బాధ్యత‌లు నిర్వర్తించ‌డం అదృష్టంగా భావిస్తున్నట్టు మాజీ మేయర్ బొంతు రామ్మోహ‌న్ ట్వీట్ లో పేర్కొన్నారు.

- Advertisement -

Latest news

Related news