32.7 C
Hyderabad
Monday, March 1, 2021

తారకరాముడిపై అవ్వ అభిమానం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గంభీరావుపేట పర్యటనలో కేటీఆర్ కి అనుకోని సంఘటన ఎదురైంది. ప్రోగ్రామ్ ముగించుకోని తన కారు వద్దకు బయలుదేరిన కేటీఆర్ దగ్గరకు ఓ అవ్వ వచ్చింది. ‘ఏం కావాలి అవ్వ’ అని కేటీఆర్ అడిగాడు. తనను కలిసేందుకు వచ్చానన్న ఆ అవ్వను చూసి కేటీఆర్ ఉప్పొంగిపోయాడు. టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆమె పెంచుకున్నఅభిమానానికి ఫిదా అయ్యాడు. మాస్కు ధరించిన కేటీఆర్‌ను తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. మాస్కు తీసి తనతో సెల్ఫీ దిగాలని అవ్వ అడిగింది. అవ్వ అభ్యర్థన మేరకు ఆమెతో సెల్ఫీ దిగి ఉత్సాహపరిచారు. ఇంకా ఏమైనా కావాలా అని కేటీఆర్‌ అడగ్గా తెలంగాణ వచ్చింది.. అది చాలని అవ్వ సంతోషంగా చెప్పింది.

- Advertisement -

Latest news

Related news