20.9 C
Hyderabad
Saturday, January 16, 2021

కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన మంత్రి మల్లా రెడ్డి

పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారాన్ని తగ్గిస్తున్నారని కార్మిక, ఉపాధి శాఖల మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా ఉన్నారన్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరా గా నిలుస్తున్నదన్నారు. ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమం లో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ శివ గౌడ్ గారు, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...