కరోనాను ఎదుర్కోవటంలో వైద్య సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. నార్సింగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్ఎం జయమ్మ కు తొలిటీకాను వేయడం ద్వారా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి ప్రధానమంత్రి వర్చువల్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. కోవిడ్ కట్టడికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారన్నారు. వ్యాక్సిన్ చేయించుకున్నోళ్లు దైర్యంగా ఉండాలని, మరింత ఉత్సహంతో ప్రజలకు సేవ చేయాలని, కరోనాను ప్రారద్రోలే ప్రతిజ్ఞ చేయలాని పిలుపునిచ్చారు.
