వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండల కేంద్రంలో పీఎంజీఎస్వై రోడ్డు పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. మోమిన్ పేట్ నుండి కొల్కుంద వరకు రూ.3 కోట్ల 24 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు మంత్రి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శంకుస్థాపన చేసి.. పనులు ప్రారంభించారు. వీలైనంత త్వరగా రోడ్డు పనులు పూర్తి చేసి.. ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనుల నాణ్యతలో తేడా వస్తే సహించేది లేదని హెచ్చరించారు.