29.3 C
Hyderabad
Monday, March 1, 2021

విజయ ఐస్ క్రీమ్స్ ప్రారంభించిన మంత్రి తలసాని

విజయ డైరీ ఉత్పత్తులు కొత్తగా ప్రవేశపెట్టిన ఐస్ క్రీమ్స్ ఫ్లేవర్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నాంపల్లి లోని లలిత కళా తోరణంలో విజయ తెలంగాణ చేసిన విజయ ఐస్ క్రీమ్స్ ను ఆయన ప్రారంభించి రుచి చూశారు.

కొన్ని దశాబ్దాలుగా నాణ్యత పాటిస్తూ.. పాల ఉత్పత్తులు చేస్తూ విజయ డైరీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నదని మంత్రి అన్నారు. కొత్త ఫ్లేవర్లతో విజయ డైరీ ఉత్పత్తి చేసిన ఐస్ క్రీమ్ లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, హోం మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రన్, సీపీ అంజన్ కుమార్, విజయ డైరీ ఛైర్మన్ లోకా భూమారెడ్డి తదితరులు రుచి చూశారు.

- Advertisement -

Latest news

Related news