తిరుమలలో వెంకటేశ్వరుని దర్శించుకున్న ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్క నాటి మొక్కు తీర్చుకున్నారు. స్వామివారికి మొక్కను కానుకగా ఇచ్చి తన హరిత భక్తిని చాటుకున్నారు. వెంకటేశ్వరుని సన్నిధిలో మొక్కకు జీవం పోసి దైవ చింతనతో పాటు ప్రకృతి చింతనను కూడా ప్రచారం చేస్తున్నారు.
సహచర మిత్రులు ఎమ్మెల్సీ నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెన్నమనేని శ్రీనివాస రావులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్క నాటడం అనేది ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలని.. అప్పుడే ఈ భూమి పది కాలాల పాటు పచ్చగా ఉంటుందనన్నారు.