24.2 C
Hyderabad
Friday, January 22, 2021

ఇయ్యాల్టి నుంచి రిజిస్ట్రేషన్ మొదలు.. అందుబాటులోకి 54 సేవలు

రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 54 రకాల సేవలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. దస్తావేజులను స్టాంప్‌ పేపర్లపై కూడా చేసుకునే ఏర్పాటు చేసింది. ఇందుకు స్లాట్‌ బుకింగ్‌ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (టీపిన్‌) లేదా ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (టీపీఐఎన్‌) అవసరం లేద, ఆధార్‌ తప్పనిసరి కాదన్నారు.

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కార్డ్ (కంప్యూటర్‌ ఎయిడెడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌- సీఏఆర్డీ) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చకచకా జరుగనున్నాయి. ఇందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. కార్డు విధానంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అన్న అంశాలను పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవడంతో సోమవారం నుంచి పూర్తిస్థాయి సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

గతంలో మాదిరిగానే అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 54 రకాల సేవలను అందించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. దస్తావేజులను స్టాంప్‌ పేపర్లపై చేసుకోవచ్చు. స్థిరాస్తి క్రయ, విక్రయదారులు తమ దస్తావేజులో ఏమైనా పొరపాట్లు ఉన్నా, అనుమానాలున్నా ఎవరి ప్రమేయం లేకుండా సబ్‌రిజిస్ట్రార్లను నేరుగా సంప్రదించి పూర్తి విశ్వాసంతో రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకోవచ్చని, స్లాట్ బుకింగ్ అవసరం లేదని ఉన్నతాధికారులు సూచించారు. టీ-పిన్‌, టీపీఐఎన్‌ అవసరం లేదని చెప్పారు. ఆధార్‌ కార్డు కూడా తప్పని సరి కాదు. కానీ గుర్తింపును నిర్ధారించే ఓటర్‌ ఐడీ కార్డు, రేషన్‌ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ లాంటివి ఏదైనా ఒకటి వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అధికారికంగా అనుమతించిన లేఅవుట్లలోని భవనాలు, ప్లాట్లు, ఫ్లాట్లు ఇతర స్థిరాస్తులను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అనధికార లేఅవుట్లలోని స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు ఆస్కారం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌‘ విధానంలో ఎవరైతే ముందు వస్తారో వారికి ముందుగా రిజిస్ట్రేషన్‌ అవుతుందని తెలిపారు. దీనికి టోకెన్‌ పద్ధతిని అవలంబించనున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

Latest news

Related news

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

మగవాళ్లను భయపెడుతున్న కోవిడ్ కొత్త సర్వే

వ్యాక్సిన్ వచ్చి.. మెల్లగా కరోనా తగ్గిపోతుందన్న సందర్భంలో.. ఓ కొత్త న్యూస్ భయపెడుతుంది. వైరస్ సోకిన పురుషుల్లో అతికొద్ది మందికి కామన్ గా ఒక లక్షణం కనిపిస్తోంది.

రికార్డు సృష్టించిన సెన్సెక్స్.. రీజన్ ఏంటంటే..

ఈ కొత్త సంవత్సరంలో మునుపెన్నడూ లేనివిధంగా సెన్సెక్స్ కొత్త రికార్డుని సృష్టించింది. లాభాల జోరులో పెట్టుబడులను బూస్ట్ చేసేలా భారీ అంచనాలను పెంచేసింది. బాంబే స్టాక్‌...