ఆన్ లైన్ మోసాల పేరుతో రోజుకో కొత్త కేసు నమదవుతూనే ఉంది. ఎక్కడో ఓ చోట అమాయకులు మోసపోతూనే ఉన్నారు. అయితే.. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నంబర్, వేలి ముద్రల ఫోటో, నీటి చుక్కల సాయంతో ఖాతాల్లోని నగదు దొంగిలించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ వెబ్సైట్ నుంచి నిందితులు మధురా నగర్ కు చెందిన సిద్ధిరెడి వీరవెంకట సత్యనారాయణ భూముల దస్తావేజులు డోన్లోడ్ చేశారు. అందులోని ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫోటోలతో బాధితుడి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.10 వేలు కాజేశారు.
ఈమేరకు బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపాయింట్ ద్వారా డబ్బులు స్వాహా చేసినట్లు నిందితులు నేరం ఒప్పుకొన్నారు. సీఏ చదువుతున్న విశాల్, అర్షద్లు డబ్బు అవసరమై ఈ నేరానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు.